Share News

హమాలీల కుటుంబాలను రోడ్డున పడేయొద్దు

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:52 PM

బఫర్‌ గోదాముల నుంచి నిత్యావసర సరుకుల సరఫరా విధానంతో హమాలీల కుటుంబా లను రోడ్డున పడేయొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, యూనియన్‌ గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ గోవిం దరావు డిమాండ్‌చేశారు.

హమాలీల   కుటుంబాలను రోడ్డున పడేయొద్దు
జడ్పీకార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న హమాలీలు

అరసవల్లి, జూలై 6(ఆంధ్రజ్యోతి): బఫర్‌ గోదాముల నుంచి నిత్యావసర సరుకుల సరఫరా విధానంతో హమాలీల కుటుంబా లను రోడ్డున పడేయొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, యూనియన్‌ గౌరవాధ్యక్షుడు సీహెచ్‌ గోవిం దరావు డిమాండ్‌చేశారు. సోమవారం శ్రీకాకుళంలోని జడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, గ్రీవెన్స్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరునెలలుగా కోటబొమ్మాళి, నరసన్నపేట, ఆమ దాలవలస, పలాస, సరుబుజ్జిలి, పొందూరు, కంచిలి పాయింట్ల నుంచి కొత్త పద్ధతిని ప్రారంభిస్తామని బెదిరింపులకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాత విధానాన్ని కొనసాగిం చాలని డిమాండ్‌చేశారు.కార్యక్రమంలో నారాయణరావు, నాగరా జు, దుర్యోధన, కామరాజు, లోకేష్‌, మోహనరావు, లబ్బ శ్రీను, రాము, భుజంగరావు, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:52 PM