Share News

‘బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు’

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:24 AM

బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మక అప్పన్న, సవర గురునాథ్‌, జోగేంద్ర, జయరాం డిమాండ్‌ చేశారు.

‘బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు’
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సంఘ ప్రతినిధులు

కాశీబుగ్గ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మక అప్పన్న, సవర గురునాథ్‌, జోగేంద్ర, జయరాం డిమాండ్‌ చేశారు. శుక్రవారం కాశీబుగ్గ సీఐటీయూ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఇచ్ఛా పురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చాల ని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజును కలిసి వినతి పత్రం ఇచ్చారని, దానికి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నట్టు తెలిపారు. బెంతు ఒరియాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ముందంజలో ఉన్నారని, అదేవిధంగా ఒడిశాలో బీసీ-ఏ జాబితా లో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో వారిని ఎస్టీ జాబి తాలో చేర్చడం వల్ల నిజమైన ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్య క్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఎస్టీ ఎమ్యెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటికీ ఐటీ డీఏ లేదని, నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాల్ని షెడ్యూల్డ్‌ ప్రాంతంలో కలప కపోవడంతో గిరిజనుల భూములను గిరిజనేతరులు దోచుకుంటున్నా, ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ఆరోపిం చారు. సమావేశంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు విప్రో,భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2026 | 12:25 AM