Share News

మత్స్య సంపదకు నష్టం కలిగించొద్దు

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:27 PM

మత్స్య సంపదకు నష్టం కలిగించకుండా సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు.

మత్స్య సంపదకు నష్టం కలిగించొద్దు
ఎచ్చెర్ల: చేపల వేటకు వినియోగించే పరికరాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు

ఎచ్చెర్ల, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): మత్స్య సంపదకు నష్టం కలిగించకుండా సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. బుడగట్లపాలెంలో బుధవారం భారతీయ మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యం లో సముద్ర మత్స్య వనరులు, సాగర మత్స్య వేట క్రమబద్దీకరణ నిర్వహణ చట్టం సవరణపై వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడగట్లపాలెం తీరంలో రూ.444 కోట్లతో ఫిషింగ్‌ హార్బ ర్‌ నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని, దీంతో తీర ప్రాంతం రూపురేఖలు మారుతాయన్నారు. సముద్రంలో చేపల వేటకు వినియోగించే పరికరాల ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ టి.సుమలత, ఎఫ్‌ఎస్‌ఐ మెరైన్‌ ఇంజనీర్‌ ధనుం జయరావు, సీనియర్‌ శాస్త్రవేత్త ప్రసాదరావు, మత్స్యశాఖ ఏడీ డి.గోపీకృష్ణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, మాజీ సర్పంచ్‌ అల్లుపల్లి రాంబాబు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు చీకటి శ్రీరాములు, కూటమి పార్టీల నేతలు గాలి వెంకటరెడ్డి, సంపతిరావు నాగేశ్వరరావు, పైడి ముఖ లింగం, ఎఫ్‌డీవో కె.రవికుమార్‌ పాల్గొన్నారు.

‘ఆర్థికాభివృద్ధి సాధించండి’

రణస్థలం, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొబ్బరి రైతులు సద్విని యోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. దేరసాంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో కొబ్బరి అభివృద్ధి బోరు సౌజ న్యంతో కొబ్బరి ఆధారిత పంట విధానాలపై అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా కొబ్బరిలో ఉత్పాద కత పెంపు, నేల ఆరోగ్య పరిరక్షణ, సమగ్ర పంట సంరక్షణ, సుస్థిర వ్యవసాయ విధానాల ప్రాముఖ్యతను వివరించారు. కొబ్బరిలో అంతర పంటగా కోకో, అరటి, కూరగాయలు వేసుకుని అదనపు ఆదాయం పొంద వచ్చ న్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు లంక శ్యామ లరావు, పిసిని జగన్నాథం నాయుడు, ఉద్యాన అధికారి అమరేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:27 PM