మత్స్యకారుల పొట్టకొట్టొద్దు
ABN , Publish Date - Oct 11 , 2026 | 11:44 PM
తరతరాలుగా సముద్రంపైనే ఆధార పడి జీవనం సాగిస్తున్న 150 కుటుంబాల మత్స్యకారుల పొట్టకొట్టొద్దని సాగర మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు వంక ఢిల్లేశ్వరరావు కోరారు.
మందస, అక్టోబరు11 (ఆంధ్రజ్యోతి): తరతరాలుగా సముద్రంపైనే ఆధార పడి జీవనం సాగిస్తున్న 150 కుటుంబాల మత్స్యకారుల పొట్టకొట్టొద్దని సాగర మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు వంక ఢిల్లేశ్వరరావు కోరారు. ఆదివారం మండలంలోని దున్నూరు పంచాయతీ గెడ్డూరులో సాగర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సముద్రంవేటతో సంబంధం లేని కొంతమంది వ్యక్తులు అక్రమంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కాగితా లపై సంఘాలు సృష్టిస్తే తమ సంప్రదాయవృత్తి ఉనికికే ప్రమాదమని హెచ్చ రించారు. ఈవిషయమై ఎమ్మెల్యే శిరీష దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కలె క్టర్, మత్స్యశాఖాధికారులకు ఫిర్యాదుచేసి దర్యాప్తుచేయాలని కోరనున్నట్లు చె ప్పారు. కార్యక్రమంలో మత్స్య సహకార సంఘ ప్రతినిధులు వంక ధర్మారా జు, పిచ్చుక శేఖర్, మోహనరావు, కోడ చండీరావు, శాంతారావు పాల్గొన్నారు.