ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:00 AM
: ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిశీలించి వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి
శ్రీకాకుళం క్రైం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో పరిశీలించి వాటి పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యా దుల స్వీకరణ, పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 61 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని అన్నారు. ప్రతి ఫిర్యా దుపై నిష్పక్షపాతంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరిం చాలన్నారు. ఈ సందర్భంగా కుటుంబ వివాదాలు, పౌర సంబంధిత సమస్యలు, ఆస్తి వివాదాలు, సివిల్, సైబర్ మోసపూరిత ఘటనలు తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించారు.