‘సర్’పై నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:36 PM
‘సర్’ ప్రక్రియపై నిర్లక్ష్యం వద్దని, బీఎల్వోలు విధులు సక్రమంగా నిర్వహించాలని జాయింట్ కలె క్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశించారు.
- బీఎల్వోలు సక్రమంగా విధులు నిర్వహించాలి
- జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
- ఇద్దరికి షోకాజ్ నోటీసులు
ఇచ్ఛాపురం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియపై నిర్లక్ష్యం వద్దని, బీఎల్వోలు విధులు సక్రమంగా నిర్వహించాలని జాయింట్ కలె క్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ ఆదేశించారు. సోమవారం అన్ని సచివాల యాల పరిధిలో జరుగుతున్న ‘సర్’ ప్రక్రియను పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధులపై బీఎల్వోలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఈఆర్‌వోల లాగిన్లలో గణనీయ మైన పెండింగ్స్ ఉన్న విషయాన్ని గమనించారు. ఇప్పటికే విచారణ పూర్తయిన కేసులను ముందుగా డిస్పోజ్ చేసి, తమ లాగిన్ల లోని పెండింగ్స్ క్లియర్ చేయాలని ఏఈఆర్‌వోలకు ఆదేశించారు. సంబంధిత పత్రాలు, విచారణకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసి, ఆమోదించిన తరువాత మాత్రమే విచారణ పూర్తయిన ట్లు పరిగ ణించాలని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 6గంటల నుంచి 9గంటల వరకు ఓటర్లకు అందుబాటులో ఉండి అవరమైన పత్రాలను సేకరిం చాలని సూచించారు. విధినిర్వహణలో అలసత్వం వహించిన డిప్యూటీ ఎంపీడీవో కె.లక్ష్మణరావు, మండపల్లి బీఎల్వో హేమంత్‌కు జేసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పోలింగ్ కేంద్రాల పరిశీలన..
ఇచ్ఛాపురం మండలం, మున్సిపాల్టీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేష న్లను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి హోం సందర్శించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన కొన్ని లోపాలను వెం టనే సరిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారి చేశారు