Share News

గ్రామాల్లో ఘర్షణలకు అవకాశం ఇవ్వద్దు: ఎస్పీ

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:01 AM

: గ్రామాల్లో ఘర్షణలు... వివాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సిబ్బందికి సూచించారు.

గ్రామాల్లో ఘర్షణలకు అవకాశం ఇవ్వద్దు: ఎస్పీ
కోటబొమ్మాళి: దంత పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

కోటబొమ్మాళి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ఘర్షణలు... వివాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సిబ్బందికి సూచించారు. మండలంలోని సమస్యాత్మక గ్రామమైన దంతలోని పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి ఘర్ణణలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిఐ కె.శ్రీనివాస్‌, ఎస్‌ఐ వి.సత్యనారాయణలకు సూచించారు

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

టెక్కలి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక కె.కొత్తూరు దరి ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూమ్‌లను శనివారం రాత్రి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సంబంధిత సిబ్బందికి సూచనలిచ్చారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

మూడంచెల భద్రత

ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌. ధనుంజయనాయుడు తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయాన్ని శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రాల వద్ద గొడవలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణకు సౌకర్యంగా ఉండే గదులను ఏర్పాటు చేయాలని అధికారులకు, ఎస్‌ఐ సీహెచ్‌. చిరంజీవికి ఆదేశించారు. అభ్యర్థి నామినేషన్‌ వేసేందుకు వచ్చేటప్పుడు ఆయన పేరు ప్రతిపాదించే ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సిబ్బందికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 56 అత్యంత సమస్యాత్మక గ్రామాలు, 68 సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని డీఎస్పీ ధనుంజయనాయుడు చెప్పారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

కాశీబుగ్గ, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ప్రశాంతంగా, జరిగేందుకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ రమణమూర్తి కోరారు. శనివారం చినబడాం గ్రామస్థులతో సమావేశమై... ఎన్నికల నిబంధనలు, శాంతిభద్రతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఒత్లిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. గొడవలకు దిగవద్దని, సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పపెట్టవద్దని చేయవద్దని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2026 | 12:01 AM