భక్తులను దర్శనానికి అనుమతించొద్దు
ABN , Publish Date - Nov 20 , 2026 | 12:36 AM
న్న తిరుపతిగా పేరొందిన కాశీబుగ్గలోని వేంకటేశ్వర ఆలయంలో భక్తులకు అనుమతి ఇవ్వవద్దని...ఏకాదశి పూజలు చేసుకోవచ్చని డీఎస్పీ జీవీ రమణ నిర్వాహకులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుతో కలసి గురువారం ఆలయాన్ని సందర్శించారు.
కాశీబుగ్గ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చిన్న తిరుపతిగా పేరొందిన కాశీబుగ్గలోని వేంకటేశ్వర ఆలయంలో భక్తులకు అనుమతి ఇవ్వవద్దని...ఏకాదశి పూజలు చేసుకోవచ్చని డీఎస్పీ జీవీ రమణ నిర్వాహకులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులుతో కలసి గురువారం ఆలయాన్ని సందర్శించారు. శుక్రవారం కార్తీక ఏకాదశి సందర్భంగా అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గత ఏడాది కార్తీక ఏకాదశి సందర్భంగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్పీ జీవీ రమణ, సీఐ అప్పారావు ఆలయాన్ని సందర్శించారు. తొక్కిసలాట ఘటన తరువాత అప్పట్లో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, అదనపు ఎస్పీ కేవీ రమణ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ 11 రకాల సూచనలు చేసింది. గత కొద్ది నెలలుగా వీటికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపుగా పనులు పూర్తిచేసి ఆలయ కమిటీ ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
ఆ సూచనలు అమలు కాలేదు
నిపుణుల కమిటీ చెప్పిన 11 రకాల సూచనల మేరకు ఏర్పాట్లు చేయలేదని డీఎస్పీతో పాటు సీఐ, మున్సిపల్ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏకాదశి పూజల వరకూ ఫర్వాలేదు..కానీ భక్తుల దర్శనానికి అనుమతి లేదన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ నిపుణుల కమిటీ సూచనల మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు వచ్చిన తరుణంలో కేవలం ఏకాదశి పూజలు మాత్రమే చేసుకోవాలని అధికారులు పునరుద్ఘాటించారు. గ్రిల్స్ బలంగా లేవని..సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేవని అన్నారు. 11 సూచనలతో కూడిన పనులు చేస్తే... నివేదికను పరిశీలించి.. కలెక్టర్‌కు అందజేస్తామని డీఎస్పీ రమణ వారికి చెప్పారు.