దానయ్య కుటుంబానికి న్యాయం చేయండి
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:03 AM
దుబ్బ దానయ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని శ్రీకృష్ణయాదవ సంఘం నాయకులు తెలిపారు.
పలాస, జూలై 13(ఆంధ్రజ్యోతి): దుబ్బ దానయ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తామని శ్రీకృష్ణయాదవ సంఘం నాయకులు తెలిపారు. సోమవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు లొడగల కామేశ్వరరావుయాదవ్, సప్పనవీన్, అంబటి కృష్ణమూర్తి, దడియాల నర్సింహులు, బద్రి గోపాల్ మాట్లాడుతూ దానయ్య మరణానికి మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు అరవ్‌వర్మ కారకుడని, వ్యవస్థలను తారుమారు చేసి మాజీ మంత్రి అనుచరుడు సిద్ధార్థత్యాడిని బలిపశువుచేరాని ఆరోపించారు. ఈ విషయంపై విచారణ జరిపించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కేసు తప్పుదోవ పట్టించడం, తమ సంఘానికి కూడా తప్పుడు సమాచారం అందించడాన్ని ఖండిస్తున్నామన్నారు. గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి అప్పలరాజు నుంచి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేసారు.