Share News

న్యాయం చేయండి

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:48 PM

: తనను ప్రేమించాడని.. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని..

న్యాయం చేయండి
మౌనదీక్ష చేస్తున్న యువతి

- అంబేడ్కర్‌ విగ్రహం వద్ద యువతి మౌనదీక్ష

హిరమండలం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తనను ప్రేమించాడని.. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాడని.. ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తరువాత కాదంటున్నా డని.. తనకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతూ మండలంలోని భగీరథపు రం కాలనీకి చెందిన యువతి శనివారం హిరమండలం పాతబస్టాండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. భామిని మండలం సింగిడి గ్రామానికి చెందిన కొట్నాన చంద్రశేఖర్‌ తన అమ్మమ్మ వారి గ్రామం భగీరథపురం కాలనీకి వచ్చేవాడు. ఆ సమయంలో యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసు కుంటానని యువతికి చంద్రశేఖర్‌ మాటిచ్చాడు. అయితే, సీఆర్పీఎఫ్‌ జవానుగా ఉద్యోగం వచ్చిన తరువాత యువతిని పట్టించుకోవడం లేదు. పెళ్లి చేసుకోమంటే కాదంటున్నాడు. దీనిపై గత నెల 25న హిరమండలం పోలీస్‌ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని, అందుకే మౌనదీక్ష చేపట్టినట్లు యువతి చెబుతుంది. తన కుమార్తెకు సరైన న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని యువతి తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయమై కొత్తూరు ఎస్‌ఐని వివరణ కోరగా.. ‘యువతి ఫిర్యాదు మేరకు ఇప్పటికే హిరమండలం ఎస్‌ఐ హేమంత్‌కల్యాణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.’అని తెలిపారు.

Updated Date - Mar 07 , 2026 | 11:48 PM