Share News

6, 7 తేదీల్లో అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లాస్థాయి ఎంపికలు

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:58 PM

అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి ఎంపికలు ఈనెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

6, 7 తేదీల్లో అమరావతి చాంపియన్‌షిప్‌ పోటీలకు జిల్లాస్థాయి ఎంపికలు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): అమరావతి చాంపియన్‌ షిప్‌ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి ఎంపికలు ఈనెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు గాను నియోజకవర్గస్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు జిల్లా స్థాయి ఎంపికలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో జిల్లాస్థాయి అర్చరీ, అథ్లెటిక్స్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌, హాకీ, వెయిట్‌ లిఫ్టింగ్‌, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, యోగా విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఇక్కడి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు, నియోజకవర్గస్థాయిలో ఎంపి కైన క్రీడాకారులు 6,7 తేదీల్లో ఉదయం 9 గంటలకు కోడిరామ్మూర్తి స్టేడియంలో వయోపరిమితికి సంబంధించిన ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

Updated Date - Aug 03 , 2026 | 11:58 PM