Share News

26న జిల్లాస్థాయి బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:06 AM

జిల్లాస్థాయి సీనియర్‌ బేస్‌బాల్‌ పురుషులు, మహిళా జట్ల ఎంపికలను స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఈనెల 26న నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు తమ్మినేని సుజాత, కార్యదర్శి గుంట ముక్కల వీరభ ద్రరావు తెలిపారు.

26న జిల్లాస్థాయి బేస్‌బాల్‌ జట్ల ఎంపికలు

శ్రీకాకుళం స్పోర్ట్స్‌, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాస్థాయి సీనియర్‌ బేస్‌బాల్‌ పురుషులు, మహిళా జట్ల ఎంపికలను స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో ఈనెల 26న నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు తమ్మినేని సుజాత, కార్యదర్శి గుంట ముక్కల వీరభ ద్రరావు తెలిపారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు సెప్టెంబరు మొదటి వారంలో కోచింగ్‌ పూర్తి చేసుకుని, సెప్టెంబరు 12 నుంచి 14వ తేదీ వరకు సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరగనున్న 8వ రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు జనన ధ్రువీ కరణ పత్రం, రెండు పాస్‌ పోర్టు సైజు ఫోటోలు ఎంపికల స్థలానికి వచ్చి ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.రవికుమార్‌ వద్ద రిపోర్టు చేయా లని కోరారు.

Updated Date - Aug 21 , 2026 | 12:06 AM