Share News

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

ABN , Publish Date - Jul 08 , 2026 | 12:06 AM

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా సబ్‌ జూనియర్స్‌ బాలబాలికలను ఎంపిక చేశారరు. రాష్ట్ర టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది.

రాష్ట్రస్థాయి టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
ఎంపికైన క్రీడాకారులతో నిర్వాహకులు

పలాస, జూలై 7(ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర టెన్నికాయిట్‌ పోటీలకు జిల్లా సబ్‌ జూనియర్స్‌ బాలబాలికలను ఎంపిక చేశారరు. రాష్ట్ర టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. బాలుర జట్టుకు కె.గౌతమ్‌, కార్తీక్‌మహరణ, బి.రిషి, ఎం.స్వరాజ్‌లు ఎంపిక కాగా స్టాండ్‌బైగా ఎస్‌.ప్రేమ్‌కుమార్‌, కె.లిఖిత్‌లు ఉన్నారు. బాలికల జట్టుకు ఎస్‌.దివ్య, శుభశ్రీసాహు, పి.యుగువ, ఎస్‌.సంతోషిలు ఎంపిక కాగా... స్టాండ్‌బైగా కె.హేమలత, జి.సోనియా ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎంపిక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హెచ్‌ఎం పి.రవికుమార్‌ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా టెన్నికాయిట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.సంతోష్‌కుమార్‌, కార్యదర్శి ఎస్వీ జోగారావు, వ్యాయామ ఉపాధ్యాయులు బి.శంకరరావు, ఆర్‌.శ్రీనివాసరావు, జి.లోకేష్‌, మధు, బి.తిరుమల, దామోదర్‌లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లాలో నిర్వహించే పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 12:07 AM