జాతీయ ఆర్చరీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:44 PM
): జాతీయ విలు విద్య (ఆర్చరీ) చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జాతీయ విలు విద్య (ఆర్చరీ) చాంపియన్‌షిప్ పోటీలకు జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన ఎన్టీసీపీ చెరుకూరి లెనిన్ వాల్గా మెమో రియల్ మినీ అండర్-10, 13, 15 రాష్ట్రస్థాయి పోటీల్లో అర్జున ఆర్చరీ అకాడమీకి చెందిన క్రీడాకారులు పాల్గొని సత్తా చూపారు. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ యూలో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అకాడమీ కార్యదర్శి ఎల్.చిట్టి బాబు తెలిపారు. అండర్-15 రికర్వ్‌లో అరంగి కల్యాణ్, అండర్-13లో ఎన్.జనిత్, బి.మోక్షజ్ఞ, అండర్-13 కాంపౌండ్ లో కె.చేతన్ స్వరూప్, అండర్-10లో ఎం.సహస్త్ర, బిషవిష్య, జి.జై కవీష్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అకాడమీ కార్యదర్శితో పాటు కోచ్‌లు ఎ.మధుసూదన్, ఎ.శ్రీనివాసరావు, నవీన్ అభినందించారు. కార్యక్రమంలో అకాడమీ ప్రతినిధులు గోపిన కృష్ణప్రసాద్, పి.గోవిందరావు, ఎ.శివాజీ, ఓ.శ్రీనివాసరావు, కె.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.