Share News

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:02 PM

కేసుపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులకు సోమవారం పట్టాదారు పాసు పుస్తకాలను తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు అందజేశారు.

   పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
సోంపేట రూరల్‌: పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తున్న తహసీల్దార్‌

ఇచ్ఛాపురం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేసుపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులకు సోమవారం పట్టాదారు పాసు పుస్తకాలను తహసీల్దార్‌ ఎన్‌.వెంకటరావు అందజేశారు. ఇంకా ఎవరికైనా పాస్‌ పుస్తకాలు రాకపోతే కార్యాలయంలో దరఖా స్తులు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఉప తహసీల్దార్‌ శ్రీహరి, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, మండల అధ్యక్షుడు ఎల్‌.పద్మనాభం, డి.కామేష్‌, చంద్ర శేఖర్‌, కూర్మారావు, తదితరులు పాల్గొన్నారు.

సోంపేట రూరల్‌, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): దామోదరపురం గ్రామంలో సోమ వారం రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అధికారులు పంపిణీ చేశారు. 63 మంది రైతులకు ఉచితంగా పంపిణీ చేసినట్టు తహసీల్దార్‌ బి.అప్పలస్వామి తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:02 PM