Share News

ఐక్యతకు భంగం

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:57 PM

YCP puts a brake on unanimous panchayat elections గత స్థానిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 137 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలను అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనంత వరకూ ఏకగ్రీవం చేయాలని అప్పటి సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చారు. ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేస్తే టిక్కెట్‌ కట్‌ చేస్తానంటూ సొంత పార్టీ నేతలకే హెచ్చరికలు జారీచేస్తున్నారు.

ఐక్యతకు భంగం

  • ఏకగ్రీవ పంచాయతీల ఆనవాయితీకి వైసీపీ బ్రేక్‌

  • అధికారంలో ఉన్నప్పుడు ప్రోత్సాహం

  • ఇప్పుడు స్వార్ధ రాజకీయం కోసం జగన్‌ ఆరాటం

  • రణస్థలం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి)

  • లావేరు మండలం చిన్న రొంపివలస పంచాయతీ.. 2021 ఎన్నికల్లో ఏకగ్రీవమైంది. గ్రామంలో ఎటువంటి రాజకీయ గొడవలు లేకుండా ఉండేందుకు గ్రామస్థులంతా ఐకమత్యమయ్యారు. సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • జి.సిగడాం మండలంలో సంతవురిటి, కప్పరాం, వెంకయ్యపేట, ఎస్‌ఆర్‌సీ పురం పంచాయతీలు కూడా 2021 ఎన్నికల్లో ఏకగ్రీవం అయ్యాయి. అప్పట్లో ఆయా గ్రామాల ప్రజలు రాజకీయ వివాదాలకు తావులేకుండా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

  • గత ఎన్నికల్లో పోలాకి మండలం మబగాం పంచాయతీ ఏకగ్రీవమైంది. ఇది ధర్మాన సోదరులతోపాటు ప్రస్తుత నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సొంత గ్రామం. అటువంటి గ్రామంలో ప్రజలు ఐక్యంగా తీర్మానించుకొని సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక్క పోలాకి మండలంలోనే 6 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం.

  • ఇలా గత స్థానిక ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 137 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 2021 ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికలను అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వీలైనంత వరకూ ఏకగ్రీవం చేయాలని అప్పటి సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. ఏకగ్రీవాల నజరానాలు, దాని ప్రయోజనాలు అంటూ సొంత పత్రికలో ప్రత్యేక ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చేసుకునేందుకు ఇదో గొప్ప అవకాశమని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చారు. ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేస్తే టిక్కెట్‌ కట్‌ చేస్తానంటూ సొంత పార్టీ నేతలకే హెచ్చరికలు జారీచేస్తున్నారు. గ్రామాల్లో ఐక్యతకు భంగం వాటిల్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

  • బంధాలకు బ్రేక్‌

  • జిల్లావ్యాప్తంగా 912 పంచాయతీలు ఉన్నాయి. సాధారణంగా గ్రామాల్లో చుట్టరికాలు, బంధుత్వాలు ఉంటాయి. రాజకీయంగా ఒకరినొకరు విభేదించుకుంటారు. కానీ కుటుంబ కార్యక్రమాలు వచ్చేసరికి ఐక్యమవుతారు. స్థానిక ఎన్నిక సమయాల్లో అధికారపార్టీకి అనుకూలమైన, సానుభూతిపరులకు అవకాశమిస్తారు. గ్రామంలో క్రియాశీలకంగా, సామాజికపరంగా సేవలందించే యువతకు అవకాశం కల్పిస్తుంటారు. గ్రామ అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించుకొని సర్పంచ్‌, ఎంపీటీసీ వంటి పదవులు అందిస్తుంటారు. కానీ ఈ ఆనవాయితీకి.. తన పార్టీ మనుగడ, రాజకీయం కోసం జగన్‌ బ్రేకులు వేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అన్నిపార్టీల నాయకులు ఏకగ్రీవానికి ప్రయత్నించినా.. వైసీపీ మండల, నియోజకవర్గ నేతలు స్థానిక పార్టీ శ్రేణులను పిలిచి.. ఎట్టి పరిస్థితుల్లో బరిలో నిలవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. దీంతో పంచాయతీల్లో ఏకగ్రీవ సంస్కృతికి బ్రేక్‌ పడుతోంది.

Updated Date - Oct 22 , 2026 | 11:57 PM