Share News

కార్మికులను తొలగించడం అన్యాయం

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:41 PM

శ్యాంపి స్టన్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 150 మంది కార్మి కులకు 30 ఏళ్ల సర్వీసు పూర్తయిందన్న నెపంతో అర్ధంతరంగా తొలగించడం దారుణమని అఖిల పక్ష నాయకులు అన్నారు. తక్షణం వారిని విధు ల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్మికులను తొలగించడం అన్యాయం
అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు

అఖిలపక్ష నాయకులు

రణస్థలం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): శ్యాంపి స్టన్స్‌ పరిశ్రమలో పనిచేస్తున్న 150 మంది కార్మి కులకు 30 ఏళ్ల సర్వీసు పూర్తయిందన్న నెపంతో అర్ధంతరంగా తొలగించడం దారుణమని అఖిల పక్ష నాయకులు అన్నారు. తక్షణం వారిని విధు ల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వరిసాం గ్రామంలోని శ్యాంపిస్టన్స్‌ ప్లాంట్‌-2 వద్ద శని వారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, గ్రామ పంచాయతీ పెద్దలు, కార్మిక సంఘాల నాయ కులు మాట్లాడుతూ.. కార్మికులను విధుల నుంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడి పిల్లలు చదువు మధ్యలో ఆపేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. గత 8 ఏళ్లుగా వేతనాలు పెంచలేదని, మూడు నెలలకు ఒక సారి వేతనాలు ఇస్తున్నారన్నారు. ఏప్రిల్‌, మే నెలల పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు ఏడుగురు కార్మికులను అన్యాయం గా విధుల నుంచి తొలగించారని, వారిని విధు ల్లోకి తీసుకోవాలన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్‌ లంకలపల్లి ప్రసాద్‌, వివిధ సంఘాల నేతలు వడ్డాది శ్రీనివాసరావు, సురేష్‌ రాజు, ఆకలి శ్రీనివాసరావు, ఎం.దుర్గారావు, అల్లం పల్లి భాస్కరరావు, సీఐటీయూ నాయకులు పి. తేజేశ్వరరావు, సీహెచ్‌ అమ్మన్నాయుడు తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:41 PM