క్రీడలతో యువతలో క్రమశిక్షణ
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:42 PM
క్రీడలతో యువతలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఐక్యత పొందవచ్చనని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు.
కొత్తూరు, జనవరి 13(ఆంధ్రజ్యోతి): క్రీడలతో యువతలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఐక్యత పొందవచ్చనని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. మంగళవారం మండలంలోని ఓం డ్రుజోలలో ఎంపీహెచ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరక్టర్ బామిడి రాజు ఆధ్వర్యంలో ఆయన తల్లి జ్ఞాపకార్ధం జరిగిన క్రికిట్ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచిన మూడు జట్లకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పర్లాఖిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, బీజేడీ నాయకులు తిరుపతిరావు, బామిడి రాజు, వి.సుధాకరావు, అరుబోలు దశరధరావు, మాధవరావు, మాతల గాంఽధీ పాల్గొన్నారు.