మట్టి రోడ్లు కనిపించకూడదు
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:28 PM
నియో జకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా మట్టి రోడ్లు కనిపించకూడదని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అధికారులను ఆదేశించారు.
-మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): నియో జకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా మట్టి రోడ్లు కనిపించకూడదని మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు అధికారులను ఆదేశించారు. నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పంచాయ తీరాజ్, ఏపీఎస్‌ఐడీఎస్‌శాఖల అధికారులతో ఆయ న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ మార్చి 31లోగా పూర్తి చేయాలని ఆదే శించారు. సీసీ రోడ్లు, కాలువల పనులకు సంబంఽ దించిన బిల్లులు మార్చిలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సంతబొమ్మాళి మండలం వాడ్రాడ, కొండపేటలో రెండు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మథనగోపాల సాగరం ప్రాజెక్టు పెండింగ్ పను లను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్ర మంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, అధికారులు సుధాకర్, వీరన్నాయుడు, రామకృష్ణ, సూర్యప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ
నందిగాం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కర్లపూడి పంచాయతీ చిన్నతామరా పల్లిలో శనివారం మీ భూమి.. మీ హక్కు కింద రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్య లేని రాష్ట్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు లక్ష్యమని అన్నారు. గత ప్రభు త్వంలో జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఫొటోల పిచ్చితో రైతుల భూముల పుస్తకాలపై, సర్వేరాళ్లపై ఆయన ఫొటోలు వేసుకొని ఆనందం పొందారని విమర్శించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూరి పీఏసీఎస్ అధ్యక్షులు పి.అజయ్ కుమార్, పి.చంద్రశేఖర్, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, తహసీల్దార్ టి.సోమేశ్వరరావు, ఎంపీడీవో కుమార్ పట్నాయక్, నాయకులు ఎం.బాలకృష్ణ, ఎస్.జానకిరాం, జీరు నానీరెడ్డి పాల్గొన్నారు.