Share News

డిజిటల్‌ సేవలు అమలుచేయాలి

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:42 PM

: జిల్లాలోని ఆసుపత్రుల్లో డిజిటల్‌ సేవలను సమగ్రంగా అమలు చేయాలని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏ) డైరెక్టర్‌ పియూష్‌ సింగ్లా తెలిపారు.

 డిజిటల్‌ సేవలు అమలుచేయాలి
రిమ్స్‌లో సేవలను పరిశీలిస్తున్న పియూష్‌ సింగ్లా:

శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆసుపత్రుల్లో డిజిటల్‌ సేవలను సమగ్రంగా అమలు చేయాలని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏ) డైరెక్టర్‌ పియూష్‌ సింగ్లా తెలిపారు. శుక్ర వారం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన (రిమ్స్‌) ఆసుపత్రిని ఆయన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, మరో జాతీయ ప్రాధికార సంస్థ డైరెక్టర్‌ పంకజ్‌కుమార్‌ అరోరాతో కలిసి సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్‌ సేవలను సమగ్రంగా అమలు చేసి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు శ్రీకాకుళం ఆదర్శంగా నిలవాలని కోరా రు. రోగుల ఆరోగ్య సేవల్లో నిరంతర పారదర్శకత, సాంకేతిక సామ ర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని వివరించారు. ఏబీడీఎం మోడల్‌ జిల్లా కార్యక్రమం ద్వారా ఏబీహెచ్‌ఏ ఆధారిత రోగు ల నమోదు, స్కాన్‌, రిజిస్ట్రేషన్‌ సేవలు, డిజిటల్‌ ఓపీ, ఐపీ సేవలు, ఎలకా్ట్రనిక్‌ హెల్త్‌ కార్డులు, ఎలకా్ట్రనిక్‌ ప్రిస్ర్కిప్షన్లు, ఆరోగ్య సమాచారాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఓపీ విభాగం సేవలను పరిశీలించి, అక్కడి సిబ్బంది నుంచి వివరాలను ఆరా తీశారు. వైద్యులు రోగులను తనిఖీ చేసే విధానాన్ని పరిశీలించారు. ఫార్మసీ వద్ద మందుల పంపిణీ వ్యవస్థను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కె.అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్‌, డిజిటల్‌ హెల్త్‌ సేవల ప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 11:42 PM