దివ్యాంగ అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:03 AM
దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ఽధ్రువపత్రాలు సమర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలి పారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 8(ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అవసరమైన ఽధ్రువపత్రాలు సమర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలి పారు. జిల్లాలో 2025-26 సంవత్సరానికి గాను దివ్యాంగుల సంక్షేమ బ్యాక్ లాగ్ కోటా కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగులకు రిజర్వ్ చేయబడిన పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరించామన్నారు. అయితే స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించగా కొందరు అభ్యర్థులు అవసర మైన ధ్రువపత్రాలు సమర్పించనందున అటువంటి వారి జాబితాను జిల్లా వెబ్‌సైట్‌లో ప్రచురించడం జరిగిందన్నారు. ఆ జాబితాలో పేర్లు ఉన్నవారు గురువారం నుంచి ఏడు రోజుల్లోగా అవసరమైన ధ్రుపత్రా లను కలెక్టర్/ చైర్మన్, జిల్లా సెలక్షన్ కమిటీ, శ్రీకాకుళం- 532001కు రిజిస్టర్డు పోస్టు ద్వారా లేదా సీల్డ్ కవర్లో ఉంచి కార్యాలయంలోని ఏ-సెక్షన్ వద్ద ఉన్న డ్రాప్ బాక్స్‌లో వేయాలన్నారు.