నగరంలో ప్రబలిన డయేరియా
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:03 AM
నగరంలోని దమ్మలవీధి, మంగువారితోట, గుడివీధి, కాకి వీధి తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
రిమ్స్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు
తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రుల ఆదేశం
ఆందోళన చెందొద్దు: కలెక్టర్
మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయం హెల్ప్‌లైన్ నెంబర్: 08942-229080
అరసవల్లి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని దమ్మలవీధి, మంగువారితోట, గుడివీధి, కాకి వీధి తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డయే రియా బాధితులు ఇటు ప్రైవేటు, అటు రిమ్స్ ఆసుపత్రుల్లో చేరి చికిత్సను పొందుతు న్నారు. రోడ్డు విస్తరణ వల్ల తాగునీరు కలుషితమై డయేరియా సోకిన ట్లు బాధితులు భావిస్తున్నారు. డయేరియా విషయం తెలుసుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సంబం ధిత అధికారులను అప్రమత్తం చేశారు. సోమవారం మునిసిపల్, వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి ఆయా వీధుల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. డయేరియా బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరి స్థితిపై ఆరా తీశారు. విషయం తెలుసుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్‌లు కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకుండా అప్ర మత్తంగా ఉండాలని కోరారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, డయేరియా నియంత్రణకు చర్యలు తీసుకు న్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం ఈ ప్రాంతాల్లో 6 డయేరియా కేసులు గుర్తించామని, అయితే వారం దరూ చికిత్స తరువాత కోలుకుని, ఇళ్లకు వెళ్లిపోయార న్నారు. సోమవారం మరలా ఆయా వీధుల్లో మరో 9 కేసులు వచ్చాయని, వాటిలో గుడివీధికి చెందిన ఇద్దరు పిల్లలను కిమ్స్ ఆసుపత్రికి తరలించి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఎటు వంటి ప్రమాదం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. దమ్మల వీధి, గుడివీధిలో రెండు అంబులెన్సులను, వైద్యుల తో బృందాలను ఏర్పాటు చేశామని, వారు రాత్రంతా అందు బాటులోనే ఉంటారని, ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. మంగళవారం ట్యాంకర్లతో తాగునీటిని సర ఫరా చేస్తామన్నారు. రిమ్స్‌లో ముందు జాగ్రత్తగా ప్రత్యేక డయేరియా వార్డును సిద్ధం చేశామన్నారు. సోమ వారం నమోదైన కేసులన్నీ నిలకడగా ఉన్నాయని, అబ్వర్వేషన్ కోసం ఉంచడం జరిగిందన్నారు.
కలెక్టర్ వస్తే గాని..
ఆదివారం డయేరియా సోకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత వైద్యఆరోగ్యశాఖాధికారులు స్పందించలేదు. సోమవారం కలెక్టర్ వచ్చి పరిశీలన తరువాత ఆదేశాలిస్తే గాని వారు పట్టించుకోక పోవడంపై విమర్శలొస్తున్నాయి.