Share News

డయేరియా అదుపులో ఉంది

ABN , Publish Date - Feb 25 , 2026 | 11:46 PM

శ్రీకాకుళం నగరంలో డయేరి యా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్ర మత్తంగా ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చిందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు.

డయేరియా అదుపులో ఉంది

అరసవల్లి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో డయేరి యా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్ర మత్తంగా ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చిందని ఎమ్మెల్యే గొండు శంకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. తాగునీటి పైపులైన్‌ను తాత్కాలికంగా నిలిపివేసి, ట్యాంకర్లతో స్వచ్ఛ మైన నీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కలెక్టర్‌ తదితర అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారన్నారు. డయేరియా లక్షణాలు కనిపిం చినా వెంటనే వారి ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం జెమ్స్‌లో 12 మంది, కిమ్స్‌లో 46 మంది, రిమ్స్‌లో 11 మంది, సింధూర ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కష్టసమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన వైసీపీ నేతలు దాని కి విరుద్ధంగా రాజకీయ లబ్ధి పొందేందుకు విమర్శలు చేయడం తగదన్నారు. అధికారులు నిరంతరం శ్రమిస్తూ సమన్వయంతో పని చేస్తు న్నారని తెలిపారు, ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారులు తెలిపిన సూచనలు పాటించి సహకరించాలని కోరారు.

Updated Date - Feb 25 , 2026 | 11:46 PM