ఉగాది నుంచి వజ్రోత్సవాలు
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:17 AM
: శ్రీకాకు ళం నగరంలోని ఆర్ష, సాహిత్య, ఆధ్యాత్మిక సేవా సంస్థ ఉపనిషన్మందిరం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19వ తేదీ (గురువారం) నుంచి వచ్చే ఏడాది ఉగాది వరకు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్ తెలిపారు.
ఉపనిషన్మందిరం అధ్యక్షుడు నగేష్
అరసవల్లి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): శ్రీకాకు ళం నగరంలోని ఆర్ష, సాహిత్య, ఆధ్యాత్మిక సేవా సంస్థ ఉపనిషన్మందిరం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 19వ తేదీ (గురువారం) నుంచి వచ్చే ఏడాది ఉగాది వరకు వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షుడు గుమ్మా నగేష్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ.. ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో భాగంగా 19న ఉగాది రోజున శ్రీకోదండ రామాలయంలో ప్రముఖ జ్యోతిష పండితుడు తెన్నేటి విక్రమ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నామ న్నారు. 20 నుంచి 26వ తేదీ వరకు ప్రముఖ పండితులు రామాయణంలోని వివిధ ఘట్టాల పై ప్రసంగిస్తారన్నారు. ప్రతీరోజు సాయంత్రం 6 గంటల నుంచి శ్రీమద్రామాయణ ప్రసం గాలు నిర్వహిస్తున్నామని, ఆధ్యాత్మిక ప్రియు లు, సాహితీవేత్తలు పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు వి.కామేశ్వరరావు, పి.పతంజలి శాస్త్రి, నిష్టల నరసింహమూర్తి, డీజీ పట్నా యక్, తెన్నేటి విక్రమశర్మ, డా.మందుల మోహనరావు, తదితరులు పాల్గొన్నారు.