కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ధర్నా
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:53 PM
నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మానవవనరుల శాఖామంత్రి ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
అరసవల్లి/శ్రీకాకుళం అర్బన్/శ్రీకాకుళం ఎడ్యుకేషన్/ ఎచ్చెర్ల, జూలై 20(ఆంధ్రజ్యోతి): నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మానవవనరుల శాఖామంత్రి ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పలు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం శ్రీకాకుళం, ఎచ్చెర్లలో ధర్నా నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చేపట్టిన దీక్షను భగ్నం చేయడం దారు ణ మన్నారు. ఏడురోడ్ల కూడలిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల ఆందోళనకు కారణమైన విద్యాహక్కుచట్టం 23(1) సవరణకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదానంగా వ్యవహరించడం దారుణమన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్త్‌రఫ్ చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ, యూటీఎఫ్, పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.