మంత్రి లోకేశ్‌పై ధర్మాన వ్యాఖ్యలు తగవు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:49 PM
యువ నేత, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు తగవని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.
ఎమ్మెల్యే గొండు శంకర్
శ్రీకాకుళం అర్బన్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): యువ నేత, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు తగవని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు విశాఖ ఎ- కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. డీఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు దొంగ నాటకమ న్నారు. కేవలం జన్‌జీ పేరుతో వృద్ధులను, వైసీపీ రౌడీమూకలను కూర్చోబెట్టి దొంగ దీక్షల చేశారని ఆరోపించారు. ఈ దీక్షలో కూర్చొన్న ధర్మాన లోకేశ్‌ను చులకన చేసి మాట్లాడడం, ఉండేలు దెబ్బ గురించి ప్రగ ల్భాలు పలకడం వారి అజ్ఞా నానికి రాజకీయ అభద్రతా భావానికి నిదర్శనమ న్నారు. అసలు ఉండేలు దెబ్బ రుచి ఎలా ఉం టుందో 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజ లందరూ వైసీపీకి చూపించా రన్నారు. జగన్ మెప్పు పొంది పార్టీ పదవులు దక్కించుకునేందుకే ధర్మాన ఇలాంటి దిగజారు డు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా తీయ కుండా నిరుద్యోగులను దగా చేశారన్నారు. కూట మి ప్రభుత్వం వచ్చిన తరువాత 16,347 పోస్టు లతో మెగా డీఎస్సీ తీసి యువత కలలను ప్రభుత్వం సాకారం చేసిందన్నారు.
‘ ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలన’
గార, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని కె.సైరిగాంలో శుక్రవారం నిర్వహించారు. సంక్షేమ పథ కాలపై రూపొందించిన కరపత్రాలను ప్రజలకు అందించి వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామ న్నారు. ప్రజల సమ స్యలను అడిగి తెలుసుకు న్నారు. కార్యక్రమంలో పలు వురు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.