Share News

ఘనంగా ధనరాజ తులసమ్మతల్లి సంబరం

ABN , Publish Date - May 24 , 2026 | 11:49 PM

లొద్దపుట్టి గ్రామదేవత ధనరాజ తులసమ్మతల్లి సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ధనరాజ తులసమ్మతల్లి సంబరం
అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే బెందాళం అశోక్‌

ఇచ్ఛాపురం, మే 24 (ఆంధ్రజ్యోతి): లొద్దపుట్టి గ్రామదేవత ధనరాజ తులసమ్మతల్లి సంబరాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. దివం గత నేత పిలక పోలారావు కుటుంబ సభ్యులు అమ్మవారి ఘటాలతో బెల్లుపడ గ్రామంలో ఊరేగింపుగా వెళ్లి మొక్కులు చెల్లించారు. తుల సమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ పాల్గొన్నారు. కార్యక్రమం లో పిలక రాజ్యలక్ష్మి, పిలక సంతు, కల్యాణ్‌, రాష్ట్ర బీసీ రెడ్డిక కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండా శంకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు రెయ్యి జానకిరావు, కాళ్ల దిలీప్‌, ఆశి లీలారాణి తదితరులు పాల్గొన్నారు.

కాళీమాత ఉత్సవాల్లో పాల్గొనండి

సోంపేట రూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): తోటవూరులో ఈనెల 31 నుంచి జూన్‌ 2 వరకు నిర్వహించనున్న కాళీమాత ఉత్సవాల్లో పాల్గొనా లని గ్రామ అరుణోదయ యువజన సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం రామయ్య పుట్టుగలో ఎమ్మెల్యేని కలిసి ఆహ్వాన పత్రిక ను అందించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమోహన్‌, తోట నాగేశ్వరరావు, కోనేటి రాజారావు, దామోదర్‌, యాదవరావు, భర్తు రాజు, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2026 | 11:49 PM