దుబాయ్‌లో దేవునల్తాడ వాసి మృతి
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:10 AM
పొట్ట కూటికోసం దుబాయ్ వెళ్లిన దేవునల్తాడ గ్రామానికి చెందిన బురుగట్ల మోహనరావు(42) అనారోగ్యంతో మృతి చెందాడు. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబం.. పెద్దదిక్కు కోల్పోవడం తో ఏమిచేయాలో తెలియని పరిస్థితి, కడచూపు కూడా కరువవుందని దుఃఖ సాగరంలో మునిగిపోయింది.
కేంద్రమంత్రి చొరవతో స్వగ్రామానికి మృతదేహం
వజ్రపుకొత్తూరు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పొట్ట కూటికోసం దుబాయ్ వెళ్లిన దేవునల్తాడ గ్రామానికి చెందిన బురుగట్ల మోహనరావు(42) అనారోగ్యంతో మృతి చెందాడు. రెక్కాడితే డొక్కాడని ఆ కుటుంబం.. పెద్దదిక్కు కోల్పోవడం తో ఏమిచేయాలో తెలియని పరిస్థితి, కడచూపు కూడా కరువవుందని దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ విషయం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి చేరింది. దీంతో దుబాయ్ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని గ్రామా నికి తీసుకురావడం జరిగింది. మోహనరావు రిగ్గర్‌గా దుబాయ్‌లో పనిచేస్తు న్నాడు. ఈ నెల 9న సహచరులు పనికి రమ్మంటే ఒంట్లో నలతగా ఉందని గదిలోనే ఉండిపోయాడు. వారు పనిముగించుకొని తిరిగివచ్చే సరికి రూమ్‌లో మోహన్‌రావు విగతి జీవిగా పడిఉన్నాడు. ఈ విషయాన్ని భార్య ధనలక్ష్మికి స మాచారం అందించారు. తోడ్పాటు అందించాల్సిన కంపెనీ కూడా చేతులెత్తే యడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అప్పాజీ ఈ విషయం రా మ్మోహన్ నాయుడి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విదేశాంగ శాఖ ద్వారా దుబా య్‌లోని భారత్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. దీంతో దుబాయి నుంచి ఢీల్లీకి.. అక్కడి నుంచి విశాఖకు విమానంలో తీసుకువచ్చి బుధవారం స్వగ్రామం దేవునల్తాడకు చేర్చారు. కేంద్రమంత్రి తీసుకున్న చొరవకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మోహన్‌రావుకి భార్యతోపాటు ఇద్దరు కుమారులు రాజేష్, నితిన్ ఉన్నారు.
గాయపడిన వ్యక్తి ..
పోలాకి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): వనవిష్ణుపురం గ్రామం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అదే గ్రామానికి చెందిన మురపాల అచ్చోడు(32) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు.. పిన్నింటిపేట వైపు ద్విచక్ర వాహనంతో వస్తు న్న వ్యక్తి అచ్చోడుని బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అచ్చో డిని చికిత్స నిమిత్తం నరసన్నపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అచ్చోడు విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీ వల తల్లిదండ్రులను చూసేందుకు వచ్చి ఇలా ప్రమాదానికి గురై మృతి చెందా డు. మురపాల నర్సింగరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రంజిత్ తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): నగరం లోని వాంబే కాలనీకి చెందిన యడగళ్ల పవన్ కుమార్(27) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవా రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాలిలా ఉన్నాయి. కలెక్టరేట్ సమీపంలోని వాంబే కాలనీ 9 బ్లాక్‌లో ఓ ఇంటిలో పవన్ కుమార్ తల్లి తి రుమల, అన్నయ్య హేమంత్‌తో కలిసి నివాసం ఉం టున్నాడు. పవన్ కుమార్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యస నాలకు అలవాటు పడిన పవన్‌పై దొంగతనం కేసులు ఇటీవల నమోదయ్యాయి. అతనిపై పోలీసులు నిఘా పెట్టడంతో రెండు నెలలుగా ఇంటికి రాకుండా తిరుగు తున్నాడు. మంగళవారం రాత్రి నేను పట్టణంలోనే ఉన్నానని, ఇంటికి రానని, ఇదే కాలనీలో ఉంటానని తల్లి తిరుమలకు ఫోన్‌లో తెలిపాడు. ఏమైంది ఏమో కాని వాంబే కాలనీ బ్లాక్ నెంబర్ 17లోని ఓ ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఒకటో పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.