Share News

ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:32 PM

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సూర్యనమస్కారాల మండ పంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజు ఆదిత్యునికి రూ.5,11,312ల ఆదాయం లభించింది.

ఆదిత్యుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిక్కిరిసిన క్యూలైన్లు:

అరసవల్లి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సూర్యనమస్కారాల మండ పంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజు ఆదిత్యునికి రూ.5,11,312ల ఆదాయం లభించింది. టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.1,78,100 లు, విరాళాల ద్వారా రూ.55,312లు, ప్రసాదాల రూపంలో రూ. 1,13,700లు, ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.1,64,020ల ఆదాయం లభించినట్లు ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ తెలిపారు. ఆషాడ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని ఆదిత్యుని ఆలయ అనివెట్టి మండపంలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ శ్రీఉషా, చాయా, పద్మినీ సమేతంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి ఫణీంద్రశర్మ, సాంబమూర్తి, వేదపండితులు దర్భముళ్ల శ్రీనివాసశర్మ, వికాస్‌శర్మ పాల్గొన్నారు. కాగా ప్రసాదాల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఈవో ప్రసాద్‌ తెలిపారు. అన్నదానం, ప్రసాదాల తయారీ కేంద్రాలను పరిశీలించారు.

Updated Date - Aug 09 , 2026 | 11:32 PM