Share News

ఆదిత్యుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - May 11 , 2026 | 12:16 AM

Arasavalli.. devotional ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైశాఖమాసం ఆదివారం కావడంతో ఆదిత్యుడి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి.

ఆదిత్యుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆదిత్యాలయంలో క్యూలో భక్తులు తో కిక్కిరిసిన క్యూలైన్లు

ఒక్కరోజు ఆదాయం రూ.12.29 లక్షలు

అరసవల్లి, మే 10(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైశాఖమాసం ఆదివారం కావడంతో ఆదిత్యుడి ఆలయ పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులు.. బారులుదీరారు. ఆలయ అనివెట్టి మండపంలో పెద్ద ఎత్తున ప్రత్యేక సూర్యనమస్కారాల పూజల్లో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజు స్వామికి రూ.12,29,298 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.7,83,600, విరాళాల ద్వారా రూ.82,079 సమకూరింది. ప్రసాదాల రూపంలో రూ.2,96,700, ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ద్వారా రూ.66,919 ఆదాయం లభించింది.

Updated Date - May 11 , 2026 | 12:16 AM