శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:01 AM
శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలలు నుంచి భక్తులు రావడంతో శ్రీముఖలింగం కిటకిటలాడింది.
జలుమూరు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాఘమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా నలుమూలలు నుంచి భక్తులు రావడంతో శ్రీముఖలింగం కిటకిటలాడింది. తాకిడికి తగ్గట్టుగా దేవదాయశాఖ ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు అవస్థలుపడ్డారు. ఆలయ ప్రాంగణం లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటుచే యలేదని పలువురు వాపోయారు.