Share News

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుకు దేవీప్రియ ఎంపిక

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:45 PM

ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుకు పైడిభీమవరం విద్యార్థిని సీరపు దేవీ ప్రియ ఎంపికైంది.

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుకు దేవీప్రియ ఎంపిక
దేవీప్రియను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

రణస్థలం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుకు పైడిభీమవరం విద్యార్థిని సీరపు దేవీ ప్రియ ఎంపికైంది. 594 మార్కులు సాధించిన దేవీప్రియకు ఈనెల 29న అమ రావతిలో విద్యా శాఖామంత్రి నారా లోకేష్‌ ఈ అవార్డు అందించనున్నట్లు సమాచారం వచ్చిందని హెచ్‌ఎం టి.శోభారాణి తెలిపారు. ఈ సంద ర్భంగా శనివారం పాఠశాలలో దేవీప్రియను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు.

Updated Date - Jun 27 , 2026 | 11:45 PM