ట్రెడిషనల్ ఆర్ట్ క్యాంపులో దేవేంద్ర
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:37 PM
న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో ఇటీవల 14 రోజుల పాటు నిర్వహిం చిన రెసిడెన్సీ ట్రెడిషనల్ ఆర్ట్ క్యాంప్‌లో పాల్గొన్న బారువ గ్రామా నికి చెందిన మాడుగుల దేవేంద్ర కుమార్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినం దించారు.
రాష్ట్రపతి చేతులమీదుగా సత్కారం
సోంపేట, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): న్యూఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో ఇటీవల 14 రోజుల పాటు నిర్వహిం చిన రెసిడెన్సీ ట్రెడిషనల్ ఆర్ట్ క్యాంప్‌లో పాల్గొన్న బారువ గ్రామా నికి చెందిన మాడుగుల దేవేంద్ర కుమార్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినం దించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము జ్ఞాపిక అందించి అభినం దించారు. ఈ సందర్భంగా దేవేంద్ర మాట్లాడుతూ.. ట్రెడిషనల్ ఆర్ట్ క్యాంపులో తోటి కళాకారులతో పాల్గొని కలంకారీ ఆర్ట్ వర్క్‌పై పనిచే యడం మధురానుభూతి కలిగించిందని, రాష్ట్రపతి నుంచి అభినందనలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. పుర స్కారం అందుకుని స్వగ్రామానికి వచ్చిన దేవేంద్రకుమార్‌ను టైలర్స్ అసోసిసేషన్ బుధవారం సత్కరించింది. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు భక్తుల హేమంత్, కార్యదర్శి దుంప రమేష్, ఆట్ల చంద్రరావు, దేవ పాల్గొన్నారు.