Share News

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:02 AM

అభివృద్ధి పనులు వేగవంతంచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. మంగళవారం పాతప ట్నంలోని క్యాంపుకార్యాలయంలో పీఆర్‌, ఐటీడీఏ ఇంజనీ రింగ్‌అధికారులతో సమీక్షించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

పాతపట్నం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి పనులు వేగవంతంచేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కోరారు. మంగళవారం పాతప ట్నంలోని క్యాంపుకార్యాలయంలో పీఆర్‌, ఐటీడీఏ ఇంజనీ రింగ్‌అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, భవననిర్మాణాలు నిర్ధేశిత సమయంలో పూర్తిచేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు సాగించాలన్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యంపై ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం తీమరలో జరిగిన అభయాంజనేయ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని కమిటీ సభ్యులకు రూ.20వేలు అందజేశారు.

Updated Date - Mar 11 , 2026 | 12:02 AM