Share News

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:36 AM

కూటమి ప్రభుత్వ హయంలోనే గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసినట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలి పారు. సోమవారం కిళ్లాంలో సీసీరోడ్డును ప్రారంభించారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి
కిళ్లాం రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి :

నరసన్నపేట, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయంలోనే గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసినట్లు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలి పారు. సోమవారం కిళ్లాంలో సీసీరోడ్డును ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడు తూ కూటమి ప్రభుత్వం హయంలో గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయా లు కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, జనసేన నియోజవర్గ ఇన్‌చార్జి బలగ ప్రవీణ్‌, కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు, పొందరి కార్పొరేషన్‌ చైర్మన్‌ దామోదర నర్సింహులు, సర్పంచ్‌ బీఆర్‌ రామన్న, వంశధార డీసీ కమిటీ చైర్మన్‌ శిమ్మ చంద్రశేఖర్‌, మాకివలస మాజీ సర్పంచ్‌ యాళ్ల వేణుగోపాలరావు, కిళ్లాం ఉపసర్పంచ్‌ పి.సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే దూకలపాడులో మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్‌ పోగోటి ఉమామహేశ్వరి కలిసి పశువైద్యశిబిరం ప్రారంభించారు. అనంతరం స్థానిక మండలపరిషత్‌ కార్యాలయం ఆవరణలో పారిశుధ్య రిక్షాలు పంపిణీ చేయ డంతోపాటు స్వచ్చరఽథాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే పీ-4పై సమీక్షించారు.

Updated Date - Mar 31 , 2026 | 12:36 AM