రూ.500 కోట్ల నిధులతో అభివృద్ధి
ABN , Publish Date - Oct 24 , 2026 | 11:37 PM
నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండున్నరేళ్లలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే రవికుమార్
ఆమదాలవలస, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండున్నరేళ్లలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కోరా రు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్య మన్నారు. ఇప్పటివరకు 2,874 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చామని, మరో 20,624 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. 1,743 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామ న్నారు. మరో 1,243 కిలోమీటర్లు మేర పనులు చేపట్టనున్నట్టు వెల్ల డించారు. గ్రామాల్లో విద్యుత్ సౌకర్యాలు మెరుగుదల చేశా మన్నారు. ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుండ లక్ష్మీ దేవి చేరిక విషయంలో.. ఇద్దరం కలిశామని, అందరినీ వెంట బెట్టేస్తామని మాట్లాడారని, వెంట బెట్టడానికి కాకులు, పిచ్చుకలు కాదన్నారు. ధర్మాన సోదరులు ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగి శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డును పూర్తి చేయలేకపోయారన్నారు. సమావేశంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ పాల్గొన్నారు.