మహిళా అక్షరాస్యతతో అభివృద్ధి: డీఆర్‌డీఏ పీడీ
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:35 PM
మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్ కుమార్ అన్నారు.
ఎచ్చెర్ల, జూన్ 30(ఆంధ్రజ్యోతి): మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి సాధ్యమని డీఆర్‌డీఏ పీడీ పి.కిరణ్ కుమార్ అన్నారు. స్థానిక టీటీడీసీలో లావేరు మండల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలోని 19 మండలాలకు వార్షిక కార్యాచరణ ప్రణాళికపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వ హించారు. బడి ఈడు గల పిల్లలను పాఠశాలలకు పంపించడం, మహిళల అక్షరాస్యత, పోటీ పరీ క్షలకు సిద్ధం కావడం అవసర మన్నారు. ఆసుపత్రుల్లో కాన్పులు, రక్తహీనత లేని కుటుంబాలు మార్చ డం, మరుగుదొడ్ల వినియోగంపై పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం ఐబీ మోహనరావు, ఏపీఎం ఐబీ భాగ్యలత, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.