Share News

ఎయిర్‌పోర్టు నిర్మాణంతో అభివృద్ధి

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:52 PM

పలాస ప్రాంతంలో విమానశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్దాన ప్రాంత ప్రజలు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాల’ని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు.

ఎయిర్‌పోర్టు నిర్మాణంతో అభివృద్ధి
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

  • కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

హరిపురం, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘పలాస ప్రాంతంలో విమానశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్దాన ప్రాంత ప్రజలు ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించాల’ని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక యువతకు ఉపాధి, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని విమానశ్రయ నిర్మాణానికి అందరూ మద్దతునివ్వాలని కోరారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయే నిర్వాసితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చట్టప్రకారం నష్టపరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. సమావేశంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, కలెక్టర్‌ స్వప్నిల్‌దినకర్‌పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, టీడీపీ నాయకులు పీరికట్ల విఠల్‌రావు, భావన దుర్యోధన, రట్టి లింగరాజు, సాలిన మాధవరావు, కర్రయ్య, ఎం.లచ్చయ్య, తహసీల్దార్‌ శ్రీహరిరావు, డీటీ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2026 | 09:26 AM