Share News

అభివృద్ధి వినాశనానికి కారణం కాకూడదు

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:03 AM

అభివృద్ధి వినాశ నానికి కారణం కాకూడదని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వీఎన్‌ కృష్ణ అన్నారు.

 అభివృద్ధి వినాశనానికి కారణం కాకూడదు
మాట్లాడుతున్న మానవహక్కుల వేదిక సమన్వయకర్త కృష్ణ

మానవ హక్కుల వేదిక ఉభయరాష్ట్రాల సమన్వయకర్త వీఎన్‌ కృష్ణ

పొందూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి వినాశ నానికి కారణం కాకూడదని మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయకర్త వీఎన్‌ కృష్ణ అన్నారు. ఆదివారం పొందూ రులో డీటీఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రాంతీయ విద్యా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ము ఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లతో పర్యావరణ విధ్వంసం తప్పదన్నారు. డేటా సెంటర్లు, అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు లో ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోవా లన్నారు. డేటాసెంటర్ల ఏర్పాటుతో భవిష్యత్‌లో విశాఖ నగరానికి తాగ ునీటి సమస్య వచ్చే అవ కాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. డీటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు పేడాడ కృష్ణారావు రచించిన వ్యాససంపుటి ‘ఈ అడుగులు ఏ ప్రస్థా నానికి’ పుస్తకం ఆవిష్కరించారు. డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌వీ రమణయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతం విద్యా రంగం సంక్షోభంలో ఉందని ప్రభుత్వాలు విద్యపై దృష్టి సారించాలన్నారు. సమస్యల పరిష్కారం ఉద్యమాలతోనే సాధ్య మన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పూజారి హరిప్రసన్న, పేడా డ కృష్ణారావు, కుల నిర్మూలన పోరాట సమి తి రాష్ట్ర అధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, ఎంఈవో పి. రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2026 | 12:03 AM