Share News

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:44 PM

కూటమి ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోం దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు(ఎన్‌ఈఆర్‌) అన్నారు.

కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు
సీసీ రహదారిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్‌

జి.సిగడాం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోం దని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావు(ఎన్‌ఈఆర్‌) అన్నారు. సోమవారం మెట్టవలసలో ‘నమస్తే ఎచ్చెర్ల-మన ఊరికి మన ఎమ్మెల్యే’ కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. 2047 నాటికి వికసిత్‌భారత్‌ లక్ష్యంగా ప్రధాని మోదీ, స్వర్ణాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పనిచేస్తున్నారన్నారు. వీటిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి, తక్షణం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కామోజుల ఆరుద్ర, ఎంపీటీసీ సభ్యురాలు బెవర లక్ష్మి, కూటమి మండల అధ్య క్షులు కుమరాపు రవికుమార్‌, పైల విష్ణుమూర్తి, పీఏసీఎస్‌ చైర్మన్‌ లు బెవర జగన్నాథరావు, నక్క మురళి, కామోజుల సీతారాం, ఎచ్చెర్ల ఏఎంసీ ఉపాధ్యక్షుడు బూరాడ వెంకటరమణ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - Aug 10 , 2026 | 11:44 PM