Share News

కూటమి పాలనలోనే అభివృద్ధి

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:24 PM

కూటమి ప్రభుత్వ పాలనలోనే అన్ని విధాలుగా రాష్ట్రం అభివృది చెందుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు.

 కూటమి పాలనలోనే అభివృద్ధి
కోష్ఠలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

-విజయనగరం ఎంపీ కలిశెట్టి

రణస్థలం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనలోనే అన్ని విధాలుగా రాష్ట్రం అభివృది చెందుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. శనివారం కోష్ట గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లలో చేప ట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హమీని నెరవేర్చి ప్రజల మన్ననలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొందారన్నా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్ల పెంపు తదితర వాటిపై ప్రజలకు అవగహన కల్పించారు. కార్యక్రమంలో కూటమి నాయ కులు లంక శ్యామలరావు, మండపాక కనకారావు, కలిశెట్టి సూర్యనారాయణ, పిసిని జగ న్నాథంనాయుడు, పిన్నింటి భానోజినాయుడు, అసిరినాయుడు, పిసిని హరి పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 11:24 PM