కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి: అశోక్
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:56 PM
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. కవిటిలో అగ్ని కుల క్షత్రియ సేవా సంఘం సామాజిక కల్యాణ మండప నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశా రు.
కవిటి, అక్టో బరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమని ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. కవిటిలో అగ్ని కుల క్షత్రియ సేవా సంఘం సామాజిక కల్యాణ మండప నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశా రు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో పక్కా రోడ్ల నిర్మాణానికి నిధులు వెచ్చిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్చార్జి దాసరి రాజు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్ర ప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్ప్రదాన్, రైల్వేబోర్డు సభ్యుడు రంగారౌళో, అగ్నికుల క్షత్రి య నాయకుడు పి.లక్ష్మ ణమూర్తి, టీడీపీ నేతలు ఎస్విరమణ, పి. కృష్ణారావు, బి.రమేష్, బీమా రావురౌళో, ఎ.మధు తదితరులు పాల్గొన్నారు.