కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:11 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగిందని...రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
నరసన్నపేట, జూన్ 18(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమం దిశగా కూటమి పాలన సాగిందని...రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. గురువారం ఒక కల్యాణ మండపంలో నియోజవర్గ స్థాయిలో విజయోత్సవ సభను నిర్వహించారు. పీఎం నరేంద్రమోదీ, సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమన్వయంతో ప్రగతి పథంలో రాష్ట్రం పయనిస్తోందన్నారు. గడిచిన రెండేళ్లలో నియోజవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ కార్యాక్రమాలు అమలు చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉపాఽధి కల్పించేందుకు నారా లోకేష్ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, వంశధార డీసీ కమిటీ చైర్మన్ శిమ్మ చంద్రశేఖర్, కత్తిరి వెంకటరమణ, వైశ్యకార్పొరేషన్ డైరెక్టర్ జామి వెంకటరావు, గొద్దు చిట్టిబాబు, మెండ రాంబాబు, బైరి భాస్కరరావు, బలగ భారతి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు.