విశాఖ, విజయవాడ తరహాలో శ్రీకాకుళం అభివృద్ధి
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:15 AM
విశాఖపట్నం, విజయవాడ తరహాలో శ్రీకాకుళం నగరాన్ని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించి అభ్యర్థు లకు మద్దతుగా ప్రచారం చేశారు.
కూటమి మేయర్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించండి
నగర ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం, విజయవాడ తరహాలో శ్రీకాకుళం నగరాన్ని తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరపాలక సంస్థ ఎన్ని కల ప్రచారంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించి అభ్యర్థు లకు మద్దతుగా ప్రచారం చేశారు. మేయర్ అభ్యర్థి దానే టి రాధారాణితో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి నగర అభివృద్ధికి సహక రించాలని కోరారు. పెద్దపాడు, పాలకొండ రోడ్ల అభివృద్ధి పనులతో నగరంలో మౌలిక వసతుల విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. కార్గిల్ పార్కును ఆధునికీరించిన తర్వా త ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందన చూసి ఆశ్చ ర్యం కలిగిందన్నారు. ఇదే తరహాలో నగరంలోని ప్రతి వార్డులో పార్కులను అభివృద్ధి చేసి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘విశాఖ, విజయవాడ తర హాలో శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మేం సిద్ధం. గెలిపించేందుకు మీరు సిద్ధమా’ అని కేంద్ర మం త్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనే తమ రాజకీయాలకు పునాది తప్ప, వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ.. 16 ఏళ్ల తరువాత కూటమి ప్రభుత్వ చొరవతో ఎన్నికలు నిర్వహిస్తున్నామ న్నారు. జిల్లా కేంద్రం అభివృద్ధి చెందాలంటే కూటమి బలపరిచిన దానేటి రాధారాణిని మేయర్‌గా, కూటమి కార్పొరేటర్ల అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ప్రత్యేకార్షణగా షకలక శంకర్
నగరంలోని మండల వీధి, మహాలక్ష్మి నగర్ కాలనీ, చంపాగల్లి వీధి, మొండేటి వీధి, దమ్మలవీధి, ఏడురోడ్ల జంక్షన్, కోటి వీధి, డీసీసీబీ కాలనీ, పుణ్యపు వీధి, రైతు బజార్, పరాంకుశ నగర్ కాలనీ, సానావీధుల్లో ప్రచారం చేశారు. ప్రముఖ నటుడు షకలక శంకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
నగరంలో జనసేన భారీ ర్యాలీ
శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా జనసేన తరపున మేయర్ అభ్యర్థిగా పోటీచేస్తున్న దానేటి రాధారాణి ఆధ్వ ర్యంలో సోమవారం రాత్రి జనసేన నాయకులు, కార్యక ర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మేయర్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆమె కోరారు. అలాగే సినీనటుడు శకలక శంకర్ పాల్గొని జన సేన అభ్యర్థి దానేటి రాధారాణిని గెలిపించాలని విన్న వించారు. కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ నటి ప్రియాంక సింగ్, డా.దానేటి శ్రీధర్, గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.