Share News

అందరి సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధి

ABN , Publish Date - Nov 14 , 2026 | 11:47 PM

జిల్లా ప్రజాప్ర తినిధులు, అధికారుల సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు అన్నారు.

అందరి సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధి
నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి వారోత్సవాలను ప్రారంభిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు

-జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు

-వారోత్సవాలు ప్రారంభం

శ్రీకాకుళం కల్చరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లా ప్రజాప్ర తినిధులు, అధికారుల సహకారంతో గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శంకరరావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. నెహ్రూ చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అక్కడున్న గరిమెళ్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో స్థానిక సంస్థల నుంచి సెస్‌ బకాయిలు రూ.5కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాటిని సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో వారోత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. వారం రోజుల పాటు నిత్యం ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలకు రూపకల్పన చేశామన్నారు. తొలిరోజు బాలల దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. బాలల్లో దాగిఉండే ప్రతిభను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు తోడ్పడతాయని జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి పీవీ భాస్కరరావు అన్నారు. కార్యక్రమంలో మరో గ్రంథాలయాధికారి ఎం.నీలమ్మ, బి.విజయలక్ష్మి, కె.ప్రత్యూష, రిటైర్డ్‌ లైబ్రేరియన్లు మురపాక శ్రీనివాసరావు, మలిపెద్ది చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

-జి.సిగడాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): స్థానిక శాఖా గ్రంథా లయంలో శనివారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభ మయ్యాయి. గ్రంథాలయాధికారి సూరి వెంకటేష్‌ తొలి ప్రధాని జవ హర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటం వద్ద జ్యోతిప్రజ్వళన చేశారు. బాలల దినోత్సవాన్ని నిర్వహించి చిన్నారులకు మిఠాయిలను పంచిపెట్టారు.

-గార, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గార శాఖా గ్రంథాలయం లో శనివారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యా యి. ఈసందర్భంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వ హించారు.గ్రంథాలయ అధికారి ఎన్‌.రామకృష్ణ, ఎంఈవో-2 పి.వినోది, గ్రంథాలయ సిబ్బంది సూర్యనారాయణ, పాఠకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 11:47 PM