Share News

రూ.పది లక్షలతో జగన్నాథ సాగరం అభివృద్ధి

ABN , Publish Date - Jun 15 , 2026 | 12:19 AM

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథ సాగరాన్ని మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌ నిధులు రూ.పది లక్షలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు.

 రూ.పది లక్షలతో జగన్నాథ సాగరం అభివృద్ధి
జగన్నాథ సాగరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

కాశీబుగ్గ జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి):పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల జగన్నాథ సాగరాన్ని మున్సిపాలిటీ జనరల్‌ ఫండ్‌ నిధులు రూ.పది లక్షలతో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆదివారం కాశీబుగ్గలో గల జగన్నాఽథ సాగరాన్ని టీడీపీ నాయకులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్నాఽథ సాగరంలో పూడికలు ముళ్లపొదలు, చెత్త తొలగించడంతో పాటు జంగిల్‌ క్లియరెన్స్‌ చేస్తామన్నారరు. సోమవారం నుంచి పనులు ప్రారంభమవుతాయని అన్నారు. సాగరం పరిసరాలను పార్కులా తయారు అభివృద్ధి చేస్తామని ఆమె చెప్పారు. దీని కోసం రూ.1.30 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, రాష్ట్ర బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, ఏఏంసీ చైర్మన్‌ శ్రీనివాసరావు, బడ్డ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, గాలి క్రిష్ణారావు, నవీన్‌, చిన్ని, డి.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2026 | 12:19 AM