టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Aug 21 , 2026 | 11:36 PM
టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం జిల్లాలో పలుచోట్ల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండే ళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిద సంక్షేమ, అభివృద్ధి పఽథకాలను ప్రజలకు వివరిస్తు కరపత్రాలను ప్రజలకు పంపిణీచేశారు.
టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం జిల్లాలో పలుచోట్ల ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండే ళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన వివిద సంక్షేమ, అభివృద్ధి పఽథకాలను ప్రజలకు వివరిస్తు కరపత్రాలను ప్రజలకు పంపిణీచేశారు.
ఫ లావేరు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలుచేస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. లావేరులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మిక కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేలు చొప్పున నేతన్న నేస్తం పఽథకం అమలుచేసి ఎంతో మంది చేనేత కార్మికులకు బాసటగా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ముప్పిడి సురేష్, ఏఎంసీ చైర్మన్ నిడిగంట్ల పద్మ, లావేరు పీఏసీఎస్ చైర్మన్ కె.దామోదరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తోటయ్యదొర, టీడీపీ నాయకులు కలిశెట్టి సూర్యనారాయణ, వెంకటరమణ, మాకన శంకరరావు పాల్గొన్నారు.
ఫ ఆమదాలవలస, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపిందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. తురకపేటలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలవరం, అమరావతి, సాగునీటి ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్, భోగాపురం విమానాశ్రయం, రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేప ట్టామన్నారు. కార్యక్రమంలో కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చం ద్రశేఖర్, టీడీపీ మండలాధ్యక్షుడు నూకరాజు, టీడీపీ నాయకులు తమ్మినేని నాని, అన్నెపు భాస్కరరావు, శెట్టి నరసింగరావు, పద్మ పాల్గొన్నారు.
ఫకంచిలి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మఖరాంపురంలో శుక్రవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని టీడీపీ నాయకుడు తమరాల శోభన్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో టీవీ రమణ, కృష్ణారావు, అప్పారావు, జగ్గారావు, భోగేష్, రమణమూర్తి, సూర్యనారాయణ, రాజారావు, శివకుమార్ పాల్గొన్నారు.