ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:46 PM
నియోజక వర్గంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ప్రజల సహ కారంతోనే సాధ్యపడుతుందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు.
ఎమ్మెల్యే కూన రవికుమార్
సరుబుజ్జిలి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నియోజక వర్గంలో ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ప్రజల సహ కారంతోనే సాధ్యపడుతుందని రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. బుధవారం జేజే రోడ్డు నుంచి చిగురువలసకి రూ.88 లక్షలతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసి, రూ.1.23 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడు తూ.. రాష్ట్రంలో కూటమి ప్రభు త్వ పాలనలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, యువ నాయకుడు నారా లోకేశ్ ఆధ్వర్యంలో పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. దీనిలో భాగం గా గ్రామాల్లోని ప్రధాన రహదారులన్నీ బీటీసీ రహదారులుగా మార్చడంతో పాటు గ్రామాల్లో సీసీ కాలువలు, రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టడం జరిగింద న్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎం. పావని, టీడీపీ నాయకులు అంబళ్ల రాం బాబు, కిల్లి లక్ష్మణరావు, తాడేల రాజారావు, లావేటి పూర్ణారావు, నందివాడ గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో రెండేళ్ల కూటమి పాలనపై ఇం టింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను వివరించారు.