Share News

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:39 AM

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
హిరమండలం: చెక్‌డ్యామ్‌ను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

ఎల్‌ఎన్‌ పేట, జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. తాయిమాంబపురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నుంచి బొత్తాడసింగి వరకు ఆర్‌అండ్‌బీ రోడ్డు పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలమైందన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడుతోనే ప్రజా సంక్షేమ పఽథకాలు, అభివృద్ధి పనులు సమానంగా జరుగుతాయన్నారు. అనంతరం ఎఫ్‌డీపేట గ్రామంలో పార్కును ప్రారంభించారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మండల పార్టీ నాయకులు ఎం. మనోహర్‌నాయుడు, కె.చిరంజీవి, వంశధార ప్రాజెక్టు వైస్‌ ఛైర్మన్‌ వి.ఆనందరావు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు కె.మన్మథరావు, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ కె.కృష్ణమాచారి, ఎ. పోలినాయుడు, ఎస్‌.బాబుకిషోర్‌, వి.గోవిందరావు. జి.మోహనరావు పాల్గొన్నారు.

రైతుల అభివృద్ధి.. సంక్షేమానికి పెద్దపీట

హిరమండలం, జూలై 6(ఆంధ్రజ్యోతి): రైతుల అభివృద్ధి, సంక్షే మానికి కూ టమి ప్రభుత్వం అత్యంత ప్రా ధాన్య మిస్తోందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నా యుడు అన్నారు. ధనుపురం గ్రామం లో పొగడ వెల్లి గెడ్డపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ను సో మవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరులు కల్పించేందుకు చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ఎంతో ఉపయెగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జెడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, మండల టీడీపీ అఽధ్యక్షులు దారపు ఢిల్లేశ్వరరావు, పీఏసీఎస్‌ అధ్యక్షులు గోళ్ల సింహాచలం, ఎస్‌.గోవింద పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మర్రిగూడ ఆశ్రమ పాఠశాలో 9,10 తరగతులు కొనసాగించాలని కోరుతూ గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు సోమవారం వినతిపత్రం అందజేశారు.

వ్యర్థాలతో ఇక్కట్లు

పాతపట్నం, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి వచ్చే వ్యర్ధాలు పాతపట్నం మహేంద్రతనయ నదిలో కలుస్తుండడంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని... ఈ సమస్య పరిష్కరించాలని స్థానిక టీడీపీ నేతలు కోరారు. ఈమేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు వినతిపత్రం ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో పైల బాబ్జీ, సైలాడ సతీష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 12:39 AM