అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:39 PM
collecter meeting ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధిం చాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం చంద్ర బాబు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధిం చాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం చంద్ర బాబు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో ఆయన అధికారులతో సమీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు ఎంఎస్‌ఎంఈ పార్కు భూసేకరణను వంద రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ‘క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరిస్తూ.. పూర్తయిన పనుల బిల్లలను వెంటనే అప్‌లోడ్ చేయాలి. జిల్లా ఆదాయ వనరులు, జీడీపీ వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి. సంక్షేమ హాస్టళ్లలో వసతులపై నిరంతర పర్యవేక్షణ ఉండాల’ని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.